2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2027 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఐఎంఎఫ్ (ఇంట్నేషనల్ మోనిటరింగ్ ఫండ్–అంతర్జాతీయ ద్రవ్య నిధి) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇది కేవలం స్లోగన్ మాత్రమే కాదని ఆ దిశలో పెద్ద యెత్తున చర్యలు కూడా తీసుకుంటున్నామని గీత గోపీనాథ్ స్పష్టం చేశారు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 6.8 నుంచి 7 శాతానికి జీడీపీ పెరగొచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదో స్థానాన్ని మూడేళ్లలో అధిగమిస్తామన్నారు.
గతంలో కూడా ఆర్థిక విశ్లేషణలకు మెరుగ్గా భారత్ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందన్నారు. పరిశ్రమలు, వాహన రంగం, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాల పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే భారత ప్రభుత్వం బడ్జెట్ లో ఆర్థిక అంచనాల కంటే గీత గోపీనాథ్ అంచనాలు ఎక్కువగా ఉండడం గమనార్హం.