నేరాల నియంత్రణకే కమ్యూనిటీ పోలీసింగ్​

సీఐ శశిధర్​ రెడ్డి

Aug 30, 2024 - 13:57
 0
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ పోలీసింగ్​
నా తెలంగాణ,రామకృష్ణాపూర్: నేరాల నియంత్రణకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రామ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. 60 మంది పోలీసులతో రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాలో పోలీసులు, నార్కోటిక్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్‌ పోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత అని అన్నారు. కాలనీల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు, షెల్టర్‌ తీసుకొని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. షీ టీం, సైబర్ నేరాలు, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీల్లో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. 
 
వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు విధిగా ధరించాలన్నారు. కాంటాక్ట్ పోగ్రామ్ లో 73 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్​ చేశారు. మరికొన్ని వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.