కేజీబీవీ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు
Collector inspections in KGBV school
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
నా తెలంగాణ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని, బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు. బోధనా పరికరాలను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి తాను చదువుకున్న దీర్ఘకాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలలోని విద్యార్థులను అడిగి వారి మేధాశక్తిని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బోధన వల్ల విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు విద్యార్థులు నేర్చుకుంటారని, దృశ్యశ్రవణ పద్ధతిలో ఉపాధ్యాయులకు సులువుగా బోధించే వీలు కలుగుతుంది. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడంతో పాటు, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించి వైద్య సేవలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి. జిల్లా కలెక్టర్ వెంట కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.