యాంటీమోనిపై చైనా నిషేధం
China ban on antimony
ప్రపంచదేశాల్లో కలవరానికి ప్రయత్నం
దేశీయ అవసరాలకు సరిపోనూ భారత్ లోనే ఉత్పత్తి
విపరీతంగా ధరలు పెరిగే అవకాశం
బీజింగ్: చైనా యాంటీమోనిపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యాంటీమోని ఉత్పత్తిలో చైనా 58 శాతం వాటా కలిగి ఉంది. ఇటీవల అమెరికా, పలు మిత్రదేశాలతోనూ చైనా విబేధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ప్రపంచదేశాలను ఇరకాటంలోకి నెట్టాలని చైనా భావిస్తోందనే చెప్పాలి. యాంటీమోని ఒక రకమైన విలువైన లోహం ప్రపంచదేశాల్లో చైనాలోనూ దీని ఉత్పత్తి అధికం కావడం గమనార్హం. అయితే అదే సమయంలో భారత్ లోనూ ఈ యాంటీమోని ఉత్పత్తి ఉన్నా దీన్ని వెలికితీసేందుకు నిధుల కేటాయింపు తక్కువగానే ఉంది. అది దేశీయ అవసరాలకు మాత్రం సరిపోతుంది. ఈ నేపథ్యంలో యాంటీమోని చైనా నిలుపుదలతో భారత్ కు ఎలాంటి నష్టం వాటిళ్లకున్నా ప్రపంచవ్యాప్తంగా ఈ లోహం ధరలు విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా దేశాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.
దీన్ని గన్ పౌడర్, ఇన్ ఫ్రారెడ్ క్షిపణులు, నైట్ విజన్ గ్లాసులు, న్యూక్లియర్ ఆయుధాలు, బ్యాటరీల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇలా చైనా తనవద్ద మాత్రమే అత్యధికంగా దొరికే లోహాలను గతంలోనూ నిషేధించింది. ప్రపంచదేశాల్లో తన ప్రాపకాన్ని నిలుపుకునేందుకు చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీమోని ఎందులో వాడతారు?..
బుల్లెట్ ప్రూఫ్ చొక్కాలలోకి చొచ్చుకుపోయే బుల్లెట్ల తయారీ కోసం, ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్, ప్రెసిషన్ ఆప్టిక్స్, లేజర్ వీక్షణ, బుల్లెట్ ప్రూఫ్ సీసం, మందుగుండు సామగ్రి ప్రైమర్, ట్రేసర్ మందుగుండు సామగ్రి, అణ్వాయుధాల ఉత్పత్తి, ట్రిటియం ఉత్పత్తులు, మంటలతో రక్షణ దుస్తులు, సైనిక దుస్తులు, కమ్యూనికేషన్ పరికరాలు, టంగ్ స్టన్ ఉక్కు, సెమీ కండక్టర్, సర్క్యూట్ బోర్డ్, విద్యుత్ స్విచ్, ఫ్లోరోసెంట్ లైటింగ్, అధిక నాణ్యత గాజు, లిథియం అయాన్ బ్యాటరీలు తదితరాల్లో ఈ యాంటీమోనిని ప్రపంచదేశాలు వాడుతున్నాయి.