మరో నౌకపై హౌతీల దాడులు

Houthi attacks on another ship

Aug 4, 2024 - 12:49
 0
మరో నౌకపై హౌతీల దాడులు

దుబాయ్​: గల్ఫ్​ ఆఫ్​ ఏడెన్స్​ లో హౌతీ తిరుగుబాటు దారులు మరో నౌకపై దాడికి పాల్పడ్డారు. కార్గోషిప్‌పై భారీ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఆదివారం అధికారులు మీడియాకు సమాచారం అందించారు. ఏడెన్‌కు ఆగ్నేయంగా 225 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు గతంలో నౌకలను లక్ష్యంగా చేసుకున్న ప్రాంతంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.

ఎర్ర సముద్రం గుండా వెళుతున్న నౌకలపై హౌతీలు దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. హనియాను ఇజ్రాయెల్​ చంపడంతో హౌతీలు సముద్రంలోని నౌకలపై దాడులు చేయాలని వ్యూహరచన చేసినట్లుగా అనుమానిస్తున్నారు. హనియా హౌతీ గ్రూపులకు ఆర్థిక సహకారం అందిస్తుంటాడని ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. కాగా సముద్రంలోని దాడులపై సమాచారాన్ని అందజేసే యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ (యూకెఎంటీవో) దాడి సమాచారాన్ని అందజేసింది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ పుజైరా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళుతున్న లైబీరియన్​ జెండాతో కూడిన కార్గొషిప్​ ‘గ్రోటన్​’పై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసినట్లుగా తెలిపింది. కాగా దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.