నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పదిహేను రాష్ట్రాల్లో విపత్తు నివారణ నిధులను కేంద్రం విడుదల చేసింది. బుధవారం ఉదయం అమిత్ షా అధ్యతన కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ లతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూ 1000 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విపత్తు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు రూ.139 కోట్లు చొప్పున, మహారాష్ట్రకు రూ. 100 కోట్లు, కర్ణాటక, కేరళలకు రూ.72 కోట్లు చొప్పున, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లకు ఒక్కొక్క రాష్ర్టానికి రూ.50 కోట్లు, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు రూ.378 కోట్లు మంజూరు చేశారు. - అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలకు నిధులు విడుదల చేశారు.
రూ. 115.67 కోట్లతో కేంద్ర పాలిత ప్రాంతాలలో సివిల్ డిపెన్స్ వాలంటీర్ల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. రూ. 3,075. 65 కోట్లతో ఏడు నగరాల్లోని అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్‌లు నాలుగు రాష్ట్రాల్లో గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (జిఎల్‌ఓఎఫ్) రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
2024లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 21,476 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఇందులో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుంచి 26 రాష్ట్రాలకు రూ.14,878.40 కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 15 రాష్ట్రాలకు రూ.4,637.66 కోట్లు, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి 11 రాష్ట్రాలకు రూ.1,385.45 కోట్లు, ఆరు రాష్ట్రాలకు ఎన్‌డిఎమ్‌ఎఫ్3 నుంచి రూ.574 కోట్లు విడుదల చేశారు.