జీ–7లో హాట్ టాపిక్ నమస్కారం!
Hot topic in G-7 Namaskar!
రోమ్: నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం. ప్రధాని మోదీ అవలంభించిన ఈ విధానం కాస్త మెల్లగా, ఆలస్యంగానైనా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందుతోంది. జీ–7 దేశాల సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోని ఆయా దేశాధిపతులకు నమస్కారంతో స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ చిత్రాలు సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. భారతీయత గౌరవానికి, మర్యాదలకు చిహ్నామైన నమస్కారంతో ఆయా దేశాలకు మెలోని స్వాగతం పలకడంతో హర్షం, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా నమస్కారం జీ–7లో హాట్ టాప్ గా మారింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా అధ్యక్ష, ప్రధానులకు మెలోని నమస్కారం చేస్తూ శిఖరాగ్రానికి ఆహ్వానం పలికారు.