పాక్​ లో చైనా ఆర్మీ!

Chinese Army in Pakistan!

Nov 28, 2024 - 13:55
 0
పాక్​ లో చైనా ఆర్మీ!
తమ పౌరుల భద్రకేనంటున్న డ్రాగన్​
ఇరుదేశాల చర్యలపై కన్నేసిన భారత్​
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: పాక్​ లో చైనా జాతీయులపై జరుగుతున్న ఉగ్ర దాడులపై ఇక చైనా సైన్యం రంగంలోకి దిగినుంది. ఇందుకు సంబంధించి ఇటీవలై చైనా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చైనా సెంట్రల్ మిలిటరీ కమీషన్ వైస్ చైర్మన్,   ఇద్దరు సైనిక అధికారులలో ఒకరైన జనరల్ జాంగ్ యూక్సియా, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో పాకిస్తాన్ తో చర్చలు జరిపారు. ఈ రెండు దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా డైనమిక్స్, ప్రాంతీయ స్థిరత్వ చర్యలు, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు నిర్వహించారు. పాక్​ లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల భద్రతపై ఇక పాక్​ ను నమ్మలేమన్నారు. తమ ఆర్మీ వారికి భద్రతా చర్యలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు పాక్​ అధికారులు కూడా ఒప్పుకున్నారు. దీంతో అతిత్వరలోనే పాక్​ లో చైనా జాతీయులు పనిచేస్తున్న ప్రాజెక్టుల వద్ద ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగనుంది. పాక్​ పెంచిపోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశంపైనే బుసలు కొడుతోంది. దీంతో ఏ దేశాలు పాక్​ ను నమ్మే దిశలో, ఆర్థికంగా ఆదుకునే విషయంలో ముందుకు రావడం లేదు. ఇక తప్పదన్నట్లు తమ భూభాగంపై చైనాకు ఆధిపత్యాన్ని పాక్​ కల్పించింది. ఇదే అంశం నచ్చని కొన్ని ఉగ్ర సంస్థలు చైనా జాతీయులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. 
 
భారత్​ అప్రమత్తం..
పాక్​, చైనాలు భారత్​ కు పైకి మిత్ర దేశాల్లా నటిస్తూనే లోపల వెన్నుపోటు పొడిచే (మిత్రద్రోహ) దేశాలని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్​ ఇంటలిజెన్స్​, ప్రభుత్వం కూడా వీరి చర్యలపై ఓ కన్నేసింది. ఇటీవల పాక్​ నుంచి జమ్మూకశ్మీర్​ లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల ఆటకట్టించడంలో భారత ఆర్మీ చురుగ్గా వ్యవహరిస్తుంది. వారి ప్రతీ చర్యను అడ్డుకుంటూ వారికి భారీగా నష్టం వాటిల్లేలా చేస్తుంది. భారత్​ కు దారితీసే అన్ని సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్​ లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఉగ్రవాదం ఆటకట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా జాతీయులపై దాడి పేరుతో చైనా ఆర్మీని పాక్​ లోకి పంపి ఆయుధాలు, యుద్ధసామాగ్రి వంటి అత్యాధునిక ఆయుధాలను పంపే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఐఎస్​ ఐ సహాయంతో ఉగ్రవాదులను ముందుకు తోసి వెనక చైనా ఆర్మీ కాపుకాసే అవకాశం ఉందనే వాదనలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా భారత్​ అన్ని విధాలా అప్రమత్తతను పాటిస్తుంది. ఇటీవలే జమ్మూకశ్మీర్​ లో జరిగిన ఓ దాడి సందర్భంగా చైనాకు చెందిన బుల్లెట్లు, ఆయుధాలు లభించాయి.