ఇరాన్​ పై ఇజ్రాయెల్ దాడి ఆరుగురు అధికారుల మృతి

ఇరాన్​ పై ఇజ్రాయెల్​ గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. పరమాణు కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది.

Apr 19, 2024 - 09:31
 0
ఇరాన్​ పై ఇజ్రాయెల్ దాడి  ఆరుగురు అధికారుల మృతి

న్యూఢిల్లీ: ఇరాన్​ పై ఇజ్రాయెల్​ గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. పరమాణు కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. ఇరాన్​ లోని ఇస్పాన్​ పట్టణం సహా మరో ఏడు ప్రాంతాలపై ఈ దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్​ ప్రకటించింది. ఎయిర్​ స్ర్టైక్​ ద్వారా దాడులు నిర్వహించింది. ఇజ్రాయెల్​ దాడుల అనంతరం ఇరాన్​ తన ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ లను యాక్టివ్​ చేసింది. ఇజ్రాయెల్​ దాడిలో ఆరుగురు అధికారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్​ లోని అనేక పట్టణాలపై దాడులు జరిగాయి. ఇస్పాన్​ ప్రాంతంలోని విమానాశ్రయంలోనూ బాంబులు వేయడంతో అక్కడి నుంచి విమానాలను రద్దు చేశారు. వస్తున్న విమానాలను దారి మళ్లించారు. అయితే ఇస్పాన్​ ప్రాంతంలో యురేనియం కేంద్రం ఉండడం కలవరం రేపుతోంది. ఇటీవలే ఇరాన్​ చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్​ వెల్లడించింది. పలుమార్లు నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే.