రష్యాకు చైనా ఆయుధాలు

ఉక్రెయిన్​ పై యుద్ధం మరింత కాలం సెక్యూరిటీ సమ్మిట్​ లో జెలెన్స్కీ ఆవేదన ప్రపంచదేశాల శాంతికి అందరూ కలిసి రావాలని పిలుపు

Jun 2, 2024 - 18:00
 0
రష్యాకు చైనా ఆయుధాలు

కీవ్​: పుతిన్​ కు చైనా మద్దతు ఇస్తుండడంతో యుద్ధం, ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సింగపూర్‌లో ఆసియా ప్రీమియర్ సెక్యూరిటీ సమ్మిట్ షాంగ్రిలా డైలాగ్ లో ఆదివారం పాల్గొని మాట్లాడారు. ఆసియా–పసిఫిక్​ దేశాలు కూడా శాంతి సదస్సులో పాల్గొనాలని ఆయన కోరారు. సదస్సును అడ్డుకునేందుకు రష్​యా తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. శాంతి శిఖరాగ్ర సమావేశానికి విఘాతం కలిగించే చర్యలను రష్యా తీసుకుంటుందని ఆరోపించారు. తమ దేశంలోని వస్తువులను నిలిపివేస్తామని బెదిరింపులకు దిగుతోందన్నారు. చైనా విధానాలు పూర్తి ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. రష్యాకు ఆయుధాలు అందిస్తున్నది చైనానే అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం చైనా రష్యా చేతిలో కీలుబొమ్మగా మారడం దురదృష్టకరమని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్​ 15 నుంచి ప్రారంభం కానున్న గ్లోబల్​ పీస్​ సమ్మిట్​ లో పాల్గొనాలని ప్రపంచ నాయకులను కోరారు. సహాయం లేకుండా యుద్ధాలను ఏ దేశం ఒంటరిగా ఆపలేదన్నారు. ఒంటరిగా వెళితే వినాశనం ఏ దేశాలకైనా తప్పదన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జీ జెన్​ పింగ్​ లు ప్రపంచ శాంతికి ముందుండాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.