బద్లాపూర్ లైంగికదాడి 300మందిపై ఎఫ్ ఐఆర్, 50 మంది అరెస్ట్
Badlapur sexual assault FIR against 300 people, 50 arrested
ముంబై: బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. మహారాష్ర్టలోని థానేలో కొనసాగిన ఆందోళనలపై ఇప్పటివరకు 300మందిపై ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసినట్లు, 50 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనకారులు మంగళవారం పెద్ద పెట్టున బద్లాపూర్ రైల్వేస్టేషన్ లో ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద పెట్టున దాడులు, లాఠీచార్జీలు కొనసాగాయి. ఆందోళనకారులు పాఠశాలను కూడా ధ్వంసం చేశారు.
ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు అక్షయ్ షిండే అనే క్లీనర్ ను అరెస్టు చేశారు. ఆందోళనల దృష్ట్యా పలువురు నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. గంటగంటకు ఆందోళనలు కొత్త ప్రాంతాలకు పాకుతుండడంతో పోలీసులు ఇంటర్నెట్ ను పూర్తిగా నిలిపివేశారు.
మరోవైపు ఆందోళనల నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపాల్, తరగతి ఉపాధ్యాయుడు, మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు మహారాష్ర్ట విద్యాశాఖ ప్రకటించింది. కేసును ఐజీ ర్యాంక్ ఐపీఎ అధికారిణి ఆర్తీ సింగ్ కు విచారణ నిమిత్తం అప్పజెప్పారు. సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ప్రజలు ఆందోళనలకు దిగవద్దని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేకూరుతుందని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అదే సమయంలో ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బాలికలపై లైంగిక దాడుల కేసు పై ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.