చెరెన్కోవ్​ ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్​

Cherenkov is the largest telescope in Asia

Oct 9, 2024 - 13:45
 0
చెరెన్కోవ్​ ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్​

శ్రీనగర్​: ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్​ టెలిస్కోప్​ ను లడఖ్​ లో ప్రారంభించారు. బుధవారం ఎంఏసీఈ (మేజర్​ అట్మాస్పియరిక్​ చెరెన్కోవ్​ ఎక్స్​ పెరిమెంట్​) టెలిస్కోప్​ ను డీఏఈ (డిపార్ట్​ మెంట్​ ఆఫ్​ అటామిక్​ ఎనర్జీ సెక్రెటరీ అజిత్​ కుమార్​ మొహంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టెలిస్కోప్ సహాయంతో శాస్త్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని తెలిపారు. దీన్ని ఈసీఐఎల్​, బార్క్​ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భూమి నుంచి 4,300మీటర్ల ఎత్తులో ఉంది. కాస్మిక్​ రే పరిశోధనలో ఈ టెలిస్కోప్​ కీలకం కానుందని తెలిపారు. గామా కిరణాల అధ్యయనంలోనూ అతి శక్తివంతంగా లోతైన అవగాహనకు మార్గం సుగమమైందన్నారు. దీని ద్వారా పరిశోధనలే గాక లడఖ్​ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుందన్నారు. అక్టోబర్​ 4నే ఈ కేంద్రాన్ని ప్రారంభించినా టెలిస్కోప్​ ను మాత్రం బుధవారం ఆవిష్కరించారు.