ట్వీట్ పై భగ్గుమన్న స్వాతి మాలివాల్
Bhaggumanna Swati Maliwal on Twitter
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సునీత కేజ్రీవాల్ ట్వీట్ పై రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ భగ్గుమంది. బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించడం పట్ల ఆమె ‘శుభప్రదమైన రోజు’ అని అభివర్ణించడం పట్ల స్వాతి మండిపడింది. బుధవారం కేజ్రీవాల్ ట్వీట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలపై దాడులు చేసిన వారిని పొగడడం మహిళలను మరింత మానసికంగా కించపర్చడమేనని, దెబ్బతీయడమేనని పేర్కొంది. తనపై దాడి చేస్తున్నప్పుడు సునీతా కేజ్రీవాల్ ఇంట్లోనే ఉండి కూడా అడ్డుకోకపోవడం శోచనీయమంది. అలాంటి వ్యక్తి బెయిల్ పై బయటికి వస్తే పొగడడం అర్థరహితమైని తెలిపింది. నిందితుడి తరఫున ఖరీదైన లాయర్లను పెట్టి అతనికి బెయిల్ వచ్చేలాగా చేసి మహిళా సమాజాన్ని కింపరిచారని స్వాతివాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుడు అన్ని చూస్తున్నాడని, న్యాయం జరుగుతుందని పేర్కొంది.