ఇస్లామిక్​ గ్రూపుల నూతన మాడ్యూల్

ఉగ్రవాదంలో టీనేజర్ల నియామకాలు వారి ద్వారానే దాడులకు ప్రణాళిక జర్మనీ ఇంటలిజెన్స్​.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి

Apr 13, 2024 - 18:17
 0
ఇస్లామిక్​ గ్రూపుల నూతన మాడ్యూల్

న్యూఢిల్లీ: ఇస్లామిక్​ టెర్రరిస్ట్​ నూతన మాడ్యూల్​ ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని జర్మనీ వెల్లడించింది. జర్మనీలో దాడికి పాల్పడేందుకు ఈ మాడ్యూల్​ ప్రయత్నిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ దేశ ఇంటలిజెన్స్​ విభాగం నలుగురిని అరెస్టు చేసింది. వీరి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడడం ప్రపంచదేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. 

జర్మనీ ఇంటలిజెన్స్​ వివరాలు..

15, 16 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక బాలిక, ముగ్గురు బాలురను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీరి ద్వారా జర్మనీలో దాడులకు పాల్పడేందుకు సమాయత్తం అయినట్లు వెల్లడించారు. వీరంతా పశ్చిమ నార్త్​ రైన్​ వెస్ట్​ ఫాలియా రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల వారని గుర్తించినట్లు పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు దాడికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. అనుమానితుల వయస్సు చిన్నది కావడంతో మరిన్ని వివరాలు బయటికి వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాలిక జర్మనీని విడిచి ఐఎస్​ఐఎస్​ లో చేరాలని యోచిస్తున్నట్లు ఇంటలిజెన్స్​ అధికారుల నిఘాలో తేలింది. అంతేగాక వారి నివాస స్థలాలకు దగ్గరగా ఉన్న చర్చిలు, ప్రార్థనా మందిరాలు తదితరాల గురించి ఐఎస్​ఐఎస్​ తో సమాచారాన్ని వీరు పంచుకోవడాన్ని గుర్తించింది. ఈ మాడ్యూల్​ కు సంబంధించి మరిన్ని వివరాలను జర్మనీ ఇంటలిజెన్స్​ రాబడుతోంది. ఏది ఏమైనా కరడు గట్టిన ఇస్లామిక్​ గ్రూపులు అమాయకులైన చిన్నారులను కూడా టార్గెట్​ గా చేసుకొని ఉగ్రవాదం వైపు మళ్లించడం ఆందోళన రేకెత్తిస్తోంది.