అనంత్ నాగ్ లో ఉగ్రదాడి ఇద్దరు జవాన్ల వీరమరణం
ముగ్గురికి గాయాలు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
శ్రీనగర్: అనంత్ నాగ్ లో ఉగ్రవాదులో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్ లోని గగర్ మండు అటవీ ప్రాంతం అహ్లాన్ లో ఉగ్రవాదులు పెద్ద యెత్తున ఆయుధాలతో ఉన్నారని శనివారం సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కు దిగాయి. దట్టమైన అటవీలో దాగి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అయితే భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ కు రంగంలోకి దిగాయి.
గాయాలైన సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.