ప్రముఖుల ఓట్లు–2 ప్రథమ పౌరురాలు ఓటు

Celebrity Votes – 2 First Citizen Vote

May 25, 2024 - 09:52
 0
ప్రముఖుల ఓట్లు–2  ప్రథమ పౌరురాలు ఓటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు రాష్ర్టపతి భవన్​ లోని ఎస్టేట్​ లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ తన ఓటు హక్కు వినియోగిచుకున్నారు. అనంతరం తన వేలిపై ఉన్న సిరా గుర్తును చూపుతూ దేశంలోని ప్రతీఒక్కరూ ఓటు వేయాలని చెప్పకనే చెప్పారు.

మహిళల భాగస్వామ్యం పెరగాలి ..స్వాతి మాలివాల్​.. 

నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆప్​ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్​ అన్నారు. శనివారం సివిల్​ లైన్స్​ లోని పోలింగ్​ బూత్​ లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీఒక్కరూ బయటికి వెళ్లి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆమెపై దాడి విషయాన్ని మీడియా ప్రశ్నిస్తున్నా ఆమె మౌనంగానే వెనుదిరిగారు. 

ఉపరాష్ర్టపతి జగదీప్​ ధనకర్​..

ఢిల్లీలో ఉపరాష్ర్టపతి జగదీప్​ ధనకర్​ సతీమణితో కలిసి శనివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్​ లో నిలుచొని తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

నవీన్​ జిందాల్​..

కురుక్షేత్ర నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్​ జిందాల్​ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్​ భారత్​ నిర్మాణానికి ఓటు వేయాలన్నారు. భారత్​ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకొని ఈ విషయాన్ని స్పష్టం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రియాంకగాంధీ కూతురు, కుమారుడి ఓటు..

ప్రియాంక గాంధీ కూతురు మిరాయా, కుమారుడు రోహన్​ లు ఓటు వేశారు. రోహన్​ రెండోసారి ఓటు వేయగా, మిరాయా తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మిరాయా పేరు నూతన ఓటర్ల లిస్టులో వెతకడంలో కొంత సమయం పట్టింది. ఈ లోపు మిరాయా నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లు కనిపించారు. రోహన్​ ఓటేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్య అని అన్నారు.