తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
అదనపు బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్రపతి
నా తెలంగాణ, హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ స్థానంలో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు మంగళవారం తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాధాకృష్ణన్ నియామకం తెలంగాణకు తమిళనాడు నుంచి వచ్చిన మూడో గవర్నర్ కావడం విశేషం. మొదటి గవర్నర్ నరసింహన్ కాగా రెండో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడు అయిన రాధాకృష్ణన్ 2023 లో జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు . పదవికి రాజీనామా చేసిన గవర్నర్ తమిళిసై సోమవారం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన రాధాకృష్ణన్కి పలువురు అభినందనలు తెలిపారు.