అద్వానీ సేవలను కొనియాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy praised Advani's services
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, భారతరత్న అందుకున్న ఎల్ కే అద్వానీని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించి కేంద్రమంత్రి వర్గంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం అద్వానీని కలిసి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చం అందజేసి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అద్వానీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అద్వానీ ప్రజాసేవలో పయనించిన తీరు భవిష్యత్ తరాలకు, ప్రయత్నాలకు వెలుగురేఖలనిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.