మహిళా సంక్షేమమే కోసమే పనిచేశా
ఇండికూటమిని కలిసేందుకు స్వాతి మాలివాల్ లేఖ
నా తెలంగాణ, న్యూఢిల్లీ: గత 18యేళ్లుగా మహిళా సంక్షేమం కోసం నిరంతరం పనిచేశానని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ అన్నారు. ఇండికూటమి పెద్ద నాయకులను కలిసేందుకు సమయం ఇవ్వాలని లేఖ రాసినట్లు సామాజికం మాధ్యమంగా మంగళవారం స్వాతి ప్రకటించారు. సేవాభావం ఉన్న తనపై సాక్షాత్తూ సీఎం హౌస్ లోనే దాడి చేసినా దిక్కు దివానం లేకపోయిందని వాపోయారు. తనపై హత్యాప్రయత్నం జరిగినా ఆ పార్టీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మహిళా కమిషన్ లో తొమ్మిదేళ్లలో 1.7 లక్షల కేసులు విన్నానని పేర్కొన్నారు. అయితే స్వాతి మాలివాల్ ను సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ కొట్టాడనే ఆరోపణలపై ఇప్పటికే జైలులో ఉన్నాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది.