హాకీలో బెల్జియం విజయం

శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్​ ఢీ

Aug 1, 2024 - 16:29
 0
హాకీలో బెల్జియం విజయం

పారిస్​: పారిస్ ఒలింపిక్స్​ లో హాకీలో భారత జట్టు ఓటమి పాలైంది. గురువారం బెల్జియంతో జరిగిన పూల్​–బీ హాకీ మ్యాచ్​ లో 1–2తేడాతో జట్టుకు ఓటమి ఎదురైంది. తొలి హాఫ్​ లో భారత్​ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి 1–0 తేడాతో ముందంజలో ఉంది. రెండో హాఫ్​ లో బెల్జియం పుంజుకొని రెండు గోల్స్​ ను సాధించింది. క్వార్టర్​ ఫైనల్​ కు అర్హత సాధించింది. కాగా రెండు వరుస విజయాలతో భారత్​ ఇప్పటికే క్వార్టర్స్​ కు చేరుకుంది. తొలి మ్యాచ్​ లో న్యూజిలాండ్​ పై 3–2 తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్​ లో ఐర్లాండ్​ తో 2–0తో గెలుపొందింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్​ మాకీ మ్యాచ్​ జరగనుంది. 

గోల్స్​ వివరాలు..

18వ నిమిషంలో భారత హాకీ ప్లేయర్​ అభిషేక్ తొలి గోల్​ ను అందించాడు. 
బెల్జియం ఆటగాడు థిబ్యూ స్టాక్‌బ్రోక్స్ 33వ నిమిషంలో తొలి గోల్​ సాధించాడు.
జాన్-జాన్ డోహ్‌మెన్ 44వ నిమిషంలో రెండో గోల్​ సాధించాడు.