మెడికో విద్యార్థిని హత్య
సీబీఐ చార్జీషీట్ లో కీలక విషయాలు వెలుగులోకి
గొంతు నులిమారు, ఊపిరాడక మృతి
హత్య జరిగిన 12 గంటల తరువాత పోస్టుమార్టం
విద్యార్థిని శరీరంలో నిందితుని ఆనవాళ్లు లభ్యం
చార్జీషీట్ లో 200మంది వాంగ్మూలాల నమోదు
కోల్‌కతా: కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికో విద్యార్థిని హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ లోని వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టంలో పలు విస్మయకర విషయాలను సీబీఐ పేర్కొంది. విద్యార్థినిని గొంతు నులిమారని ఊపిరాడకపోవడంతో మృతి చెందిందని తెలిపారు. హత్య జరిగిన 12 గంటల తర్వాత సాయంత్రం 6.10 గంటలకు బాధితురాలికి పోస్టుమార్టం నిర్వహించారని పేర్కొన్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థిని శరీర భాగాలపై ఐదుచోట్ల గాయాలయ్యాయని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం ఆగస్ట్ 9న నిందితులు ఉదయం 4 గంటలకు సెమినార్ హాల్ లోకి ప్రవేశించి, 4.30 గంటలకు బయటకు వచ్చారని తెలిపారు. బాధితురాలి పోస్టుమార్టంలో నిందితునికి సంబంధించిన ఆనవాళ్లు శరీరం నుంచి లభించాయని తెలిపారు. 200 పేజీల చార్జీషీట్ లో 200మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. చార్జీషీట్ లో గ్యాంగ్ రేప్ ప్రస్తావన లేదు.