బంగ్లాలో ఇస్కాన్ పై దాడి ఖండించిన ఎంపీ హేమామాలిని
MP Hema Malini condemned the attack on ISKCON in Bangla
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ స్వామి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును మధుర ఎంపీ హేమమాలిని తీవ్రంగా ఖండించారు. ఇది ఇస్కాన్ భక్తులకే చెందిన అంశం కాదన్నారు. బుధవారం రాజ్యసభలో ఈ అంశంపై హేమామాలిని మాట్లాడారు. బంగ్లాలో హిందువులు, దేవాలయాలే టార్గెట్ గా చేసుకోవడం దురదృష్టకరమన్నారు. అక్కడి పరిస్థితులు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎంపీ మాట్లాడుతుండగా, విపక్ష సభ్యులు నిరసనలు, నినాదాలు చేశాయి. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులను తీవ్ర స్వరంతో మందలించారు. రాజ్యసభలో వ్యవహరించాల్సిన తీరు ఇదికాదన్నారు. మొసలి కన్నీళ్లు ఇక్కడ కార్చొద్దని మండిపడ్డారు.