మెడికో హత్య.. తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం

Medico murder.. False information to parents

Aug 29, 2024 - 19:26
 0
మెడికో హత్య.. తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం
కోల్​ కతా: కోల్​ కతా మెడికో హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. ఆసుపత్రి నుంచి మూడుసార్లు విద్యార్థిని తల్లిదండ్రులకు కాల్​ చేశారన్న విషయం సీబీఐ విచారణలో బయటికి వచ్చింది. మూడుసార్లు కూడా విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆత్మహత్య చేసుకుందని త్వరగా రావాలని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ మాట్లాడుతున్నట్లు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఎన్నిసార్లుఏమైందని స్పష్టంగా చెప్పాలని వేడుకున్నా అవతలి వ్యక్తులు విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టినట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు నిందితుడు సంజయ్​ రాయ్​ తన నేరాన్ని సీబీఐ ముందు ఒప్పుకున్నాడు. మాజీ ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ తీరుపైనే పలు అనుమానాలున్నట్లు సీబీఐ చెబుతోంది. ఆ మరుసటి రోజే విద్యార్థిని తల్లిదండ్రులు తమ బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. ఆందోళనకు దిగారు. అయినా కాలేజీ ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ మీడియా ముందు కూడా విద్యార్థినిది ఆత్మహత్యే అని ప్రకటించారు.