ప్రతి రోజూ ఫిర్యాదుల స్వీకరణ

కలెక్టర్ అభిలాష అభినవ్

Jun 21, 2024 - 19:24
 0
ప్రతి రోజూ ఫిర్యాదుల స్వీకరణ

నా తెలంగాణ, నిర్మల్: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించటంలో భాగంగా ప్రతి రోజూ ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం తెలిపారు. సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు మిగతా పని దినాలలో కూడా  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదుకు రసీదులు పొందవచ్చని, ఫిర్యాదుల పురోగతిని సంబంధిత శాఖల వారీగా ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.