కుల్గామ్ లో ముగిసిన ఆపరేషన్ క్లీన్
ప్రకటించిన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులు హతం పూంచ్ దాడి ఉగ్రవాదుల గుర్తింపు
కాశ్మీర్: కాశ్మీర్ లో ఎట్టకేలకు ఆపరేషన్ క్లీన్ ముగిసినట్లుగా గురువారం తెల్లవారుజామున భద్రతా దళాల అధికారులు ప్రకటించారు. గత నాలుగురోజులుగా కుల్గామ్ లో జరిగిన ఆపరేషన్ ను ముగించామన్నారు. కుల్గాం రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సోమవారం సాయంత్రం నుంచి ఆపరేషన్ క్లీన్ చేపట్టారు. సోమవారం రాత్రి బాసిత్ అహ్మాద్ దార్, ఫహీమ్, మోమిన్ అనే ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అందింది.
సుదీర్ఘంగా కొనసాగిన ఆపరేషన్ లో తొలుత బాసిత్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. అటు తరువాత ఫహీమ్, మోమిన్ లను మట్టుపెట్టినట్లుగా అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఆపరేషన్ పూర్తయిందని వెల్లడించారు.
మరోవైపు పూంచ్ లో వైమానిక దళ కాన్వాయ్ పై దాడి జరిపిన వారిని లష్కరే తోయిబా కమాండ్ అబూ హమ్జాతో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటలిజెన్స్ గుర్తించింది. ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలు బయటపడ్డాయని వివరించింది. వీరంతా పాక్ ఉగ్రవాదులుగా తేల్చింది. అబూ హమ్జా, ఇలియాస్ ఫౌజీ, హడూర్ లు గా నిర్ధారించింది. వీరంతా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇంటలిజెన్స్ పేర్కొంది.