దలైలామాను కలవనున్న అమెరికా మాజీ స్పీకర్ నాన్సీ
భారత్ లో రెండు రోజుల పర్యటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిసేందుకు అమెరికా మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం హిమాచల్ లోని ధర్మశాలకు చేరుకున్నారు. టిబెట్‌కు సంబంధించిన రిసాల్వ్ టిబెట్ బిల్లుకు అమెరికా సెనేట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దలైలామాతో అమెరికా ప్రతినిధి బృందం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా వాదనను టిబెట్ తోపాటు అమెరికా సవాల్ చేయనుంది. ధర్మశాలకు వచ్చిన నాన్సీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాన్సీ పెలోసితో సహా అమెరికా ప్రతినిధి బృందం జూన్ 18, 19న రెండు రోజులపాటు భారత్ లో పర్యటించనుంది. దలైలామాతో భేటీ, భారత్ కు చెందిన అధికారులతోనూ ఈ బృందం భేటీ కానుంది. కాగా ఈ పరిణామం చైనాకు రుచించడం లేదు.