ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు
6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో ఎయిర్ లైన్స్, ఆకాసా ఎయిర్ లైన్స్ విమానాలకు శనివారం ఈ బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి ఇస్లాంబుల్ వెళ్లే విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఆయా విమానాలను సేప్ జోన్ కు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబులు లేవని నిర్దరించారు. గత ఆరు రోజులుగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రాగా ఆ విమాన్ని అత్యవసరం జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఇందులో 189 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. తనిఖీల అనంతరం ఏమి లేదని గుర్తించి ప్రయాణం కొనసాగించారు. విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రాగా దాన్ని ఫ్రాంక్ ఫర్ట్ కు మళ్లించారు. లండన్, పారిస్, హాంకాంగ్ లకు వెళ్లే విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ బెదిరింపులన్నీ భయపెట్టేందుకు చేస్తున్నారని, విమానాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. కాగా వరుస విమాన బెదిరింపులపై కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సమావేశమైంది. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారి పట్ల నిర్దయతో వ్యవహరిస్తూ మరింత కఠినంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.