ఖతార్ ప్రధానితో మోదీ భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ
దోహాలో ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీతో భారత ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
దోహా: దోహాలో ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీతో భారత ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మోదీకి దోహాలో భారతీయ సమాజం, ఖతార్ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘మోదీ, మోదీ’ నినాదాలు ప్రతిధ్వనించాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఖతార్‌కు చేరుకున్నారు. ఇద్దరు ప్రధానుల భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై ద్వైపాక్షిక చర్చించారు. కాగా ప్రధానమంత్రి ఖతార్‌కు వెళ్లడం ఇది రెండోసారి. ఆయన మొదటిసారిగా జూన్ 2016లో ఖతార్‌ను సందర్శించారు. నవంబర్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించబడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిని విడుదల చేసిన తర్వాత ప్రధానికి ఇదే మొదటి పర్యటన కావడం విశేషం.