బంగ్లాలో భారత్ –ముక్తివాహిని చిహ్నం ధ్వంసం
Bharat - Mukti Vahini symbol vandalized in Bangladesh
ఢాకా: బంగ్లాదేశ్ లో భారత్–ముక్తివాహిని సైన్యం విజయ చిహ్నాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. 1971లో బంగ్లాను పాకిస్థాన్ నుంచి విముక్తి చేసే పోరాటంలో భారత్ ఆర్మీ విజయం సాధించింది. ఈ సందర్భంగా అప్పటి ఆర్మీ కమాండింగ్ ఇన్ ఛీఫ్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయిన పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఎఎకే నియాజీ ఒప్పంద పత్రాలపై సంతకం చేశాడు. ఆ దృశ్యాన్ని బంగ్లాదేశ్ జాతీయ స్మారక చిహ్నాంగా ఏర్పాటు చేశారు. ముజీబ్ నగర్ లో ఉన్న ఈ చిహ్నాన్ని నిరసనకారులు కూల్చివేశారు. చిహ్నాం కూల్చడంపై తాత్కాలిక యూనస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.