అశ్లీల వీడియోలు చూడడం నేరం కాదు
కేరళ, మద్రాస్ కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టిన సుప్రీం
తిరువనంతపురం: చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్ లోడ్ చేయడం, చూడడం నేరం కాదని, ఇతరులకు చూపెడితే నేరమని సుప్రీంకోర్టు చేసింది. 2023కు సంబంధించి కేరళ కోర్టు తీర్పుపై ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. కేరళ, మద్రాస్ కోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ ఎన్జీవో సంస్థ పోర్న్ వీడియోలు చూసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు కోర్టులు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించాయి. దీనిపై విచారించిన సుప్రీం ప్రస్తుతానికి తీర్పును రిజర్వులో పెట్టింది.
కాగా భారత్ లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరుకోవడం విశేషం. అయితే ప్రతీ వినియోగదారుడు రోజులో సగటున 8.39 నిమిషాలపాటు అశ్లీల వెబ్ సైట్లను చూస్తున్నట్లు పోర్న్ హబ్ అనే సంస్థ స్పష్టం చేసింది. ఈ రకమైన వీడియోలో చూస్తున్న వారిలో 44 శాతం 18 నుంచి 24యేళ్లు, 41 శాతం మంది 25 నుంచి 34 సంవత్సరాల వారే ఉన్నారని పేర్కొంది.