వరదలను అడ్డుకోలేదని 30మందికి ఉరిశిక్ష!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ ఆదేశం

Sep 4, 2024 - 13:59
 0
వరదలను అడ్డుకోలేదని 30మందికి ఉరిశిక్ష!

సియోల్​: ఉత్తర కొరియాలో జూలైలో సంభవించిన వర్షాలు, వరదలతో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వాటిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అధికారులు విఫలమవడంతో ఆ దేశాధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ 30మంది అధికారులపై విచారణ జరిపి ఉరిశిక్ష విధించాడు. ఈ నిర్ణయంతో ఆ దేశాధికారుల్లో మరింత గుబులు పుట్టిస్తోంది. చీమచిటుక్కుమన్న తమది తప్పేలా అవుతుందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. కానీ బయటికి అంటే, చెబితే తమ పని కూడా అంతేనని లోలోన బాధపడుతున్నారు. ప్రకృతి ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికి తెలుసు. ఎన్ని అత్యాధునిక వ్యవస్థలున్నా ప్రకృతి విజృంభించే సమయాన్ని ఖచ్చితంగా చెప్పలేవు, గుర్తించలేవు. అలాంటి అధికారుల తప్పిదం ఎలా అవుతుందని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ వరదలో నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోగా, 7,410 ఎకరాల్లో పంట మునిగింది. రైళ్లు, రైలు పట్టాలు ధ్వంసమయ్యాయి. వేలాది ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. 

కిమ్​ జోంగ్​ ఉన్​ తీసుకున్న చర్య తీవ్రమైనదే అయినప్పటికీ కొంతమంది ఈ చర్యలను సమర్థిస్తుండడం విశేషం. ప్రజాసొమ్ముతో దర్జా జీవితాలను గడుపుతూ.. ఆ ప్రజా సేవలోనే నిర్లక్ష్యం వహించే వారికి ఇలాంటి తీవ్రమైన నేరాలుంటేనే దారికి వస్తారని లేకుంటే అలాంటి అధికారులపై ఎన్ని చర్యలు తీసుకున్నా ‘దున్నపోతు మీద వర్షం కురిసిన’ చందంగానే ఉంటుందనడం విశేషం.