ఓటర్లు ఇంట్లో కూర్చోవద్దు రచయిత్రి, వ్యాపారవేత్త సుధామూర్తి
Voters should not sit at home Sudhamurthy
బెంగళూరు: ఓటర్లు ఇంట్లో కూర్చోవద్దని ప్రముఖ రచయిత్రి, వ్యాపారవేత్త సుధామూర్తి అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె బెంగళూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని వారి కంటే నగరాల్లోని ప్రజల ఓటింగ్ శాతం చాలా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా ఎన్నుకున్నప్పుడే ప్రజలు కోరుకున్న పాలన దక్కించుకోగలమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు.