కోర్టులో లాఠీచార్జీ న్యాయవాదులకు గాయాలు

Baton charge in court injures lawyers

Oct 29, 2024 - 14:56
 0
కోర్టులో లాఠీచార్జీ న్యాయవాదులకు గాయాలు

ఘజియాబాద్​: ఘజియాబాద్​ కోర్టు గదిలో న్యాయమూర్తులకు, లాయర్లకు మధ్య ఓ కేసులో విచారణ విషయంలో వివాదం నెలకొంది. ఈ వివాదం కాస్త ఉద్రిక్తతలకు దారితీసి లాఠీచార్జీ వరకూ వెళ్లింది. మంగళవారం జిల్లా సెషన్స్​ కోర్టులో న్యాయమూర్తులతో లాయర్లు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో జడ్జీలు పోలీసులకు ఫిర్యాదు చేసి లాయర్లను బయటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు లాయర్లను బయటికి పంపించేందుకు ప్రయత్నించగా పెద్ద పెట్టున న్యాయవాదులు, పోలీసులకు మధ్య పెద్దపెట్టున తోపులాట చోటు చేసుకుంది. ఎంతగా చెప్పినా వినకపోవడంతో లాయర్లపై పోలీసులు లాఠీల వర్షం కురిపించింది. దీంతో కోర్టు గదిలోనే  పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. ఎంతకీ తగ్గకపోవడంతో కోర్టు బయట పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. చిలికిచిలికి గాలివానలా పరిస్థితులు మారడంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు.