బంగ్లాలో 17 క్రైస్తవుల ఇళ్లు దగ్ధం
17 Christian houses burnt down in Bangla
ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
రెండు పార్టీల వైరంలో సమిధలుగా మారుతున్న మైనార్టీలు
ఢాకా: బంగ్లాదేశ్ లో క్రిస్మస్ పర్వదినం రోజు ముష్కర మూకల దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ వివరాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేసేందుకు వెళ్లగా 17 మంది ఇళ్లను ముష్కరులు తగులబెట్టారు. ఈ దాడులు బందర్భన్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ ఎస్పీ గార్డెన్ లో జరిగాయి. దీంతో బాధితులు గూడుకోల్పోయి తీవ్ర నిరాశ, నిర్వేదంలో ఉన్నారు. తాము ఎలా బతకాలని కన్నీరుమున్నీరవుతున్నారు. ముష్కరులు జరిపిన ఈ దాడిలో 15 లక్షల టాకా (బంగ్లా కరెన్సీ) నష్టం వాటిల్లిందని లబోదిబోమన్నారు. వివరాలందుకున్న పోలీసులు మంటలు చల్లారక ఘటనా స్థలిని పరిశీలించడంపై క్రైస్తవ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపడం వెనుక తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా బాధితులు నివసిస్తున్న ఈ ఫౌంహౌస్ హసీనా ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి బెనజీర్ అహ్మద్ కు చెందినది కావడం విశేషం. రెండు పార్టీల వైరం కాస్త ఇతర మతాలు, దేవాలయాలపై చూపుతూ వారిని సమిధలు చేస్తున్నారని మానవహక్కుల సంఘాలు, పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.