తప్పుడు ప్రకటనలపై సీసీపీఏ జరిమానాలు
CCPA Penalties on False Statements
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ, సీఎస్సీ 2023 ఫలితాలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) వాజీరావు, రెడ్డి ఇన్ స్టిట్యూట్ లకు రూ. 7 లక్షలు, స్టడీ ఐక్యూ ఐఎఎస్ ఇన్ స్టిట్యూట్ కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ మూడు ఇన్ స్టిట్యూట్ లు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి వందశాతం ఉద్యోగానికి హామీ ఇస్తున్నట్లు తప్పుదోవ పట్టించాయి. దీంతో వినియోగదారుల హక్కు పరిరక్షణ చర్య కింద 2019లోని రక్షణ చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘించడంపై చర్యలు తీసుకున్నట్లు సీసీపీఏ తెలిపింది. ఈ సంస్థలు చేసిన ప్రకటనల్లో సీసీపీఏ చేసిన దర్యాప్తులో వీరి తప్పిదం ఋజువైంది. తమ సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయనే విషయంపై ఆరా తీసింది. ఇవన్నీ బూటకపు ప్రకటనలే అని తేల్చింది. గతంలో కూడా సీసీపీఏ ఇలాంటి 22 కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లపై రూ. 71.60 లక్షల జరిమానా విధించింది.