పసిడి ధరల్లో భారీ పెరుగుదల
ధన్ తేరస్ లో పెరిగిన కొనుగోళ్లు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ధన్ తేరస్ సందర్భంగా బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 601 రూపాయలు హై జంప్ చేసి 78,846 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్లలో భారీ రద్దీ నెలకొంది. వెండి కిలోకు రూ. 1152 పెరిగి రూ. 97, 238 ఆల్ టైమ్ హై లో కొనసాగుతుంది.
భారత బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరల్లో మరో మూడు రోజులపాటు పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,900 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,600గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,750 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,450గా ఉంది.
కోల్‌కతా: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,450గా ఉంది.
చెన్నై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,450గా ఉంది.
భోపాల్: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,500గా ఉంది.
హైదరాబాద్: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,450గా ఉంది.