గందర్భాల్ దాడి.. స్థానికుల సహాయ సహాకారాలు
Ganderbhal attack.. Locals help

టీఆర్ఎఫ్ హస్తంపై ఆధారాల సేకరణ
వివరాలు వెల్లడించిన ఎన్ ఐఏ
శ్రీనగర్: గందర్భాల్ దాడిలో కొత్తకోణం వెలుగులోకొచ్చింది. దాడిచేసిన ఉగ్రవాదులకు స్థానికుల పూర్తి సహాయ సహకారాలు లభించినట్లు ఎన్ ఐఏ అధికారులు మంగళవారం ఆధారాలతో సహా గుర్తించి మీడియాకు వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 20న లేబర్ క్యాంపుపై దాడిలో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యురాలు మృతి చెందింది. ఈ దాడికి బాధ్యతను ఇప్పటికే టీఆర్ఎఫ్ (లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ) తీసుకున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదులకు స్థానికుల ద్వారా వాహనం సమకూరినట్లు గుర్తించారు. అలాగే దాడికి ముందు రెక్కిలో కూడా వారికి పూర్తి సహకారం లభించింది. ఆ క్యాంపులో ఉన్న జవాన్లకు సంబంధించి అణువణువు సమాచారాన్ని సేకరించారు. దీంతో శిబిరంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో కుల్గామ్ స్థానికుడు 2023 నుంచి అదృశ్యమైన యువకుడు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన పూర్తి సీసీ టీవీ ఫుటేజీని ఎన్ ఐఏ సేకరించింది. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఎం–4, ఎకే–47లు ఉన్నట్లు గుర్తించారు. 7 నిమిషాలపాటు క్యాంపులోనేఉండి దాడి చేసి పారిపోయినట్లుగా గుర్తించారు.