కష్టపడి పైకొచ్చిన వ్యక్తి బండి సంజయ్​

చిరంజీవికి విరాభిమానిన్న కేంద్రమంత్రి మర్యాదపూర్వకం చిరుతో కలిసి బండి సంజయ్​

Jun 23, 2024 - 20:30
 0
కష్టపడి పైకొచ్చిన వ్యక్తి బండి సంజయ్​

నా తెలంగాణ, హైదరాబాద్​: బండి సంజయ్​ రాజకీయాల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని సినీనటుడు చిరంజీవి అన్నారు. విద్యార్థి దశ నుంచే తాను చిరంజీవికి వీరాభిమానిని అని బండి తెలిపారు. ఆదివారం ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్​ చిరంజీవిని మర్యాదపూర్వకంగా జూబ్లిహిల్స్​ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి బండి సంజయ్​ ను సాదారంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువకప్పి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరి మధ్య స్వల్ప కాలిక సంభాషణలో కొనసాగాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. ప్రజలకు సుభిక్ష పాలన లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాజకీయాలపై కూడా చిరంజీవి, బండి సంజయ్​ మధ్య చర్చలు కొనసాగినట్లు సమాచారం.