ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

40 శాతం సుంకం విధింపు మెట్రిక్​ టన్నుకు రూ. 45,800

May 4, 2024 - 15:50
 0
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. కనీస ధర మెట్రిక్​ టన్నుకు రూ. 45,800గా నిర్ణయించింది. శనివారం కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఉత్తర్వులు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. అంతేగాకుండా ఉల్లి ఎగుమతులపై రూ. 40 శాతం సుంకాన్ని విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది రూ. ఉల్లి ధరలు రూ. 70 నుంచి రూ. 100 వరకు పలకడంతో ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉల్లిని తమ దేశాలకు ఎగుమతి చేయాలని భారత్​ ను పలు దేశాలు అభ్యర్థించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఎగుమతులు కొనసాగనున్నాయి.