మాల్దీవులు నుంచి సైనికులు వెనక్కు
ప్రకటించిన రణ్ ధీర్ జైస్వాల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాల్దీవులు నుంచి భారతీయ సైనికులంతా గురువారమే తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 10వరకు భారతీయ సైనికులు ఒక్కరు కూడా ఉండొద్దరి మొయిజ్జు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ నిర్వహించారు. భారతీయ సైనికులందరూ తిరిగి వెళ్లినట్లు మాల్దీవులు అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది. మాల్దీవులలో రెండు ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న 51 మంది భారతీయ సైనికులు తిరిగి వచ్చినట్లు కార్యాలయం మూడు రోజుల క్రితం తెలియజేసింది. మిగిలిన ఆర్మీ సిబ్బంది కూడా మే 10 నాటికి తిరిగి వెళ్లిపోనున్నట్లు తెలిపారు.
కాగా మాల్దీవులులో సైనికుల కార్యకలాపాలను నిర్వహించడానికి పౌర సాంకేతిక సిబ్బందిని పంపారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఎన్నికల ప్రచారంలో భారత సైనికులను దేశం నుంచి బహిష్కరించే అంశాన్ని లేవనెత్తారు. దీనికి 'ఇండియా అవుట్' ప్రచారం అని పేరు పెట్టారు. సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత, ముయిజు నవంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు పర్యాటకుల సంఖ్యలో విపరీతమైన తగ్గుదల నమోదవుతుండడంతో మాల్దీవులు ప్రభుత్వంలో అంతర్గతంగా తీవ్ర అలజడి నెలకొంది. అదీగాక పలు సంబంధాలపై కూడా ఇక భారత్ పునరాలోచనలో పడడంతో ఈ అంశం కాస్త సీరియస్ కాకముందే భారత్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకు మాల్దీవులు ప్రభుత్వం అంతర్గతంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసమే గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.