బీఆర్​ఎస్​ పై బురదజల్లేందుకే మేడిగడ్డ పర్యటన

రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Feb 13, 2024 - 16:08
 0
బీఆర్​ఎస్​ పై బురదజల్లేందుకే మేడిగడ్డ పర్యటన

నా తెలంగాణ, హైదరాబాద్​: రాజకీయ లబ్ధి కోసమే సీఎం, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. దీన్ని ఖండిస్తున్నామని.. ఇది ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘ఎజెండాలో లేని అంశాలపై అధికార పార్టీ సభ్యులు ఇష్టారీతిన మాట్లాడారు. అది సభాసంప్రదాయాలకు విరుద్ధం. మేడిగడ్డ విషయంలో భారాసపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారేజీ పర్యటనకు వెళ్లే మార్గంలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కూడవెల్లి వాగు, పచ్చటి పొలాలను కూడా చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిజాలు చెప్పకుండా ఒక్క సంఘటన తీసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.