ఆర్మీ అధికారులకు విశిష్ఠ సేవా పురస్కారాలు
అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రక్షణ రంగంలో ఉత్తమ సేవలకు గుర్తుగా విశిష్ఠ సేవా పురస్కారాలను పలువురు ఆర్మీ అధికారులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అందజేశారు. శుక్రవారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక–2024లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జై శంకర్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్మీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.