22, 23న బ్రిక్స్​ సదస్సుకు మోదీ

జీ జిన్​ పింగ్​ తో భేటీ!

Oct 18, 2024 - 16:49
 0
22, 23న బ్రిక్స్​ సదస్సుకు మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్​ 22, 23 తేదీల్లో రష్​యాలో జరిగే బ్రిక్స్​ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సు రష్యాకజాన్​ లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్​ పింగ్​ తో కలవనున్నారు. బ్రిక్స్​ సదస్సులో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్​ పుతిన్​ ఆహ్వానం మేరకు మోదీ రష్యా వెళ్లనున్నారు. 
బ్రిక్స్​ సమ్మిట్ అంటే ఏమిటి?
బీఆర్​ఐసీఎస్​ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దక్షిణ అమెరికా దేశాల సమూహం. ఈ సదస్సులో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యులుగా మారాయి. ప్రపంచ జనాభాలో 45 శాతం జనాభా ఈ దేశాల్లోనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్​ దేశాల వాటా 28 శాతంగా ఉంది. 2023 ఆగస్ట్​ లో దక్షిణాఫ్​రికాలో బ్రిక్స్​ సదస్సు జరిగింది.