రక్షణ బలోపేతానికి మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటన
Defense Minister Rajnath Singh's visit to America
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్యలు ప్రారంభించారు. ఆగస్ట్ 23న అమెరికాలో పర్యటించనున్నట్లు బుధవారం రక్షణశాఖ అధికారులు తెలిపారు. రక్షణ రంగంలో రాజ్ నాథ్ పర్యటన అతి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ పర్యటనతో భారత్–అమెరికా రక్షణ రంగాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్ష కార్యదర్శి జాక్ సుల్విన్ తో మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమ అధికారులతో రాజ్ నాథ్ సింగ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రక్షణ పరిశ్రమలో జరుగుతున్న పనులు, భవిష్యత్ రక్షణ ఒప్పందాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులతో మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంభాషించనున్నారు.
భారత్ లో విమానాలు, వాటి విడిభాగాలపై రక్షణ శాఖ అధికారులతో రాజ్ నాథ్ సింగ్ సుధీర్ఘ చర్చలు జరపునున్నట్లు తెలుస్తోంది. భారత్ కు అమెరికా అందిస్తామన్న విమానాల ఆలస్యంపై మంత్రి చర్చలు జరపనున్నారు. వీలైనంత త్వరగా వాటిని అందించాలని అమెరికాకు విజ్ఞప్తి చేయనున్నారు.