బీజేపీ విజయం ఖాయమే

సీట్లలోనే తేడా ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్​ కిషోర్​ 

May 22, 2024 - 14:51
 0
బీజేపీ విజయం ఖాయమే

నా తెలంగాణ: న్యూ ఢిల్లీ: బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మూడోసారి వారి విజయం సునాయాసమేనని ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్​ కిషోర్​ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే బీజేపీ చెబుతునన్నీ సీట్లు సాధ్యం కాకపోవచ్చన్నారు. 400 సీట్లే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అందరికీ తెలిసిందేనన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు సాధించిందన్నారు. 

కానీ తన విశ్లేషణలో బీజేపీకి అన్ని స్థానాలు రావని పేర్కొన్నారు. అదే సమయంలో అధికారాన్ని మాత్రం బీజేపీయే కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అయితే మూడోసారి ప్రధాని పాలనపైనే అందరి దృష్టి ఉండనుందన్నారు. 

2014లో మోదీ సాధించిన విజయం మచ్చలేనిదన్నారు. 2019లో మోదీపై విశ్వాసంతో దేశ ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం కూడా మోదీపై ఓటర్లకు నమ్మకం ఉందని తెలిపారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదన్నారు. అనేక రంగాల్లో మోదీ సవాళ్లతో కూడుకున్న నిర్ణయాలను తీసుకున్నారన్నారు.

ఇందులో విజయం సాధించడమే ప్రజల్లో ఆయనపై నమ్మకం, విశ్వాసం పెరిగేందుకు కారణమన్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని అసంతృప్తి, సమయానుసారం పనుల్లో తగ్గిన జోరు, నిరుద్యోగం లాంటి కత్తిమీద సాములాంటి సమస్యలను కూడా బీజేపీ ఎదుర్కోనుందని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు.