భారత్ కో జానియే క్విజ్ లో పాల్గొనాలని ప్రధాని పిలుపు
Prime Minister's call for India to participate in Janiye Quiz
ప్రవాసీయులను భాగస్వామ్యం చేయాలి
దేశ, ప్రవాస భారతీయుల బంధాలు బలోపేతం
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుందాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ కో జానియే క్విజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ, విదేశాల్లో ఉన్న ప్రవాసుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ క్విజ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్విజ్ నవంబర్ 11నే విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ప్రారంభించారు. డిసెంబర్ 11వరకూ కొనసాగనుంది. ఆన్ లైన్ మాధ్యమంగా ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. భారత్ వేదికగా విదేశాల్లోని ప్రవాస భారతీయులను కూడా ఈ క్విజ్ లో పాల్గొనాలని భారతీయులని కోరాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా సుసంపన్నమైన వారసత్వం, శక్తివంతమైన సంస్కృతిని పునర్నిర్మించుకునే అద్భుతమైన మార్గాన్ని సొంతం చేసుకుందామన్నారు. గయానాలోని ప్రవాస భారతీయులు ఈ క్విజ్ లో పాల్గొనాలని ప్రధాని మోదీ ఇటీవల పర్యటనలో విజ్ఞప్తి చేశారు. ఈ క్విజ్ లో పాల్గొనేందుకు 14 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. ఇందులో 30 ప్రశ్నలు ఉండనున్నాయి. ఒక్కో ప్రశ్నకు 30 సెకన్ల గరిష్ఠ సమయాన్ని కేటాయించారు. క్విజ్ లో 30 విజేతలకు రెండు వారాలపాటు భారత్ టూర్ కు పంపించనున్నారు. క్విజ్ లో పాల్గొనే వారందరికీ ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.