తుపాకీతో పూలదండ మండిపడ్డ బీజేపీ
సీఎం సిద్ధరామయ్యది పోకిరిలు, రౌడీల సంస్కృతి
బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్య మంగళవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా విల్సన్ గార్డెన్ సమీపంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి సీఎంకు పూలమాల వేశాడు. అతడు దిగి వెళుతుండగా జేబులో తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయాబ్రాంతులను చేసేందుకే సీఎం నేతృత్వంలోని పలువురు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ తుపాకీ సంస్కృతిని సిద్ధ రామయ్య ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.
రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో రియాజ్ అనే వ్యక్తి తుపాకీతో వచ్చి పూలమాల వేశాడు. అనంతరం పోలీసులు ఈ అంశంపై వివరణిస్తూ.. అతనికి ప్రాణహాని ఉన్నందునే ప్రత్యేక అనుమతి తీసుకున్నాడని వెల్లడించడం కొసమెరుపు.