ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. శనివారం విడుదల చేసిన ఈ జాబితాలో 22 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. తొలుత బీజేపీ 99మంది జాబితాను విడుదల చేసింది. దీంతో 121మంది అభ్యర్థుల జాబితా విడుదలైన్లయ్యింది. 22మంది అభ్యర్థులలో ఒక మహిఆ అభ్యర్థికి చోటు కల్పించింది.
రెండో జాబితాలో ఎవరి పేర్లు?
ధూలే రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి రామ్ భదానే, మల్కాపూర్ నుంచి చైన్‌సుఖ్ మదన్‌లాల్ సంచేటి, అకోట్ నుంచి ప్రకాశ్ గున్వంతరావు భర్సకాలే, అకోలా వెస్ట్ నుంచి విజయ్ కమల్‌కిషోర్ అగర్వాల్, వాషిమ్ శ్యామ్ రామ్‌చరణ్జీ ఖోడే, కేవల్‌రామ్ తులసీరామ్ కాలే, మెల్ఘాట్, మిలింద్ రామ్‌జీరా వివోతెలీ నుంచి బీజేపీ పోటీ చేసింది. రాజూరా నుంచి, కృష్ణలాల్ బాజీరావు సహారే బ్రహ్మపురి నుంచి, కరణ్ సంజయ్ డియోటాలే వరోరా నుంచి, దేవయాని సుహాస్ ఫరాండే నాసిక్ సెంట్రల్ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు. నవంబర్ 20న మహారాష్ర్టలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.