గుండెపోటుతో బీజేపీ ఎంపీ మృతి

ఇంట్లోనే కుప్పకూలిన రాజ్​ వీర్​ శోకసంద్రంలో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు రెండు రోజుల క్రితమే మోదీ సభలో ఉత్సాహంగా పాల్గొన్న దిలేర్​

Apr 24, 2024 - 19:44
 0
గుండెపోటుతో బీజేపీ ఎంపీ మృతి

అలీగఢ్​: హత్రాస్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ దిలేర్ (65) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం దిలేర్ తన అలీగఢ్ నివాసంలో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన మరణవార్త విని కుటుంబసభ్యులు, మద్దతుదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

రాజ్‌వీర్ దిలేర్ 2017లో హత్రాస్‌లోని ఇగ్లాస్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ ఆయనకు 2019లో హత్రాస్ లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లోనూ రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. రాజ్‌వీర్ తండ్రి కిషన్‌లాల్ దిలేర్ కూడా హత్రాస్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఉన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ఆయన టిక్కెట్టును పార్టీ రద్దు చేసింది. ఆయన స్థానంలో దేవాదాయ శాఖ సహాయ మంత్రి, ఖేర్ ఎమ్మెల్యే అనూప్ బాల్మీకి అభ్యర్థిగా ఎంపికచేసింది. అయినా రాజీ వీర్​ దిలేర్​ బీజేపీ తరఫున గట్టి ప్రచారాన్నే నిర్వహిస్తున్నారు. 

రాజ్‌వీర్ సింగ్ దిలేర్ రెండు రోజుల క్రితం అలీఘర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కూడా విచ్చేసి ఉత్సాహంగా కనిపించారు.