11 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
IMD alert for 11 states
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి 37మంది వరకు మృతి చెందారు. వంద సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. అప్రమత్తత పాటించాలని సూచించారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీమ్ లను సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరం అయితే కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు.
మరోవైపు జూన్ 22నాటికి రుతుపవనాలు మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్లుగా ఐఎండీ స్పష్టం చేసింది.